Thursday, 30 July 2026 06:40:11 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Date : 03 January 2026 08:51 PM Views : 215

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, మాజీ పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్,ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కిసాన్ జి, నాయకులు మాట్లాడుతూ 19వ శతాబ్దంలో స్త్రీలు చదువుకోవడం అపరాధంగా భావించిన కాలంలో, అణచివేతకు గురైన వర్గాలకు విద్య అనే ఆయుధాన్ని అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె చరిత్రలో నిలిచారన్నారు. జనవరి 3న ఆమె జయంతిని జరుపుకోవడం కేవలం ఒక మహానుభావురాలిని స్మరించుకోవడమే కాదని, సమానత్వం, సామాజిక న్యాయం పట్ల మన బాధ్యతను మరోసారి గుర్తు చేసుకోవడమే అన్నారు. నేటి సమకాలీన సమాజంలో మహిళల అక్షరాస్యత రేటు పెరగడం, మహిళల రాజకీయాల్లో, క్రీడల్లో సాధిస్తున్న విజయాలను చూస్తుంటే, సావిత్రిబాయి ఆశయాలు ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుందన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియమ్మ ఆశీస్సులతో, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో తెలంగాణలోని పేద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అన్నిరకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మహిళల అభ్యున్నతి కోసం, కోటిమంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే లక్ష్యంగా, సంక్షేమాల కోసం మేం అందరం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ తెలంగాణలో విద్య, ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతున్నాయి. బీసీ వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా విద్య, రవాణా, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడమే మా ప్రభుత్వ లక్ష్యమని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: