Thursday, 30 July 2026 11:32:40 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ప్రథమ శ్రేణిలో రాణించాలి..

జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల్ల

Date : 10 April 2026 12:42 AM Views : 177

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు శ్రద్ధగా చదువుకున్నని భవిష్యత్తులో రాణించి గురువులతో పాటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, అలాగే విద్యార్థులు చెడువాలు అలవాట్లకు బానిసలు కావద్దని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయికిరణ్ కాసమల్ల తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదువు చెప్పిస్తారని వారి ఆశలను వమ్ము చేయకుండా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి తీసిపోకుండా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి విద్యను అందించడంతోపాటు పౌష్టికాహారాన్ని కూడా అందజేయడం మీ అదృష్టం అన్నారు. అంతేకాకుండా మీ యొక్క బోధకులు కూడా చాలా మంచిగా విద్యను అందిస్తున్నారని వారు చెప్పిన విద్యను సద్వినియోగం చేసుకున్నట్లయితే నీ జీవితం సుఖాంతం అవుతుందన్నారు. చదువుకునే దశలో ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా 30 సంవత్సరాలు కష్టపడి చదివినట్లయితే 80 సంవత్సరాలు సుఖంగా ఉంటారని తెలిపారు. గంజాయి, ధూమపానం,గుట్కా, అంబర్,మద్యం,తదితర వాటికి బానిస కావద్దన్నారు. ఎవరైనా ప్రేరేపించిన వారిని కట్టడి చేయాలన్నారు. అనంతరం పలు చట్టాలపై విద్యార్థులకు న్యాయవాదులు అవగాహన కల్పించారు. అవగాహన సదస్సులు ప్రిన్సిపల్ సిహెచ్. మంగ, ఏటీపీ తిరుమల్, ఏ జి పి పద్మ, న్యాయవాదులు రాజేశ్వరరావు, సత్యనారాయణ, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, న్యాయవాదులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :