Thursday, 30 July 2026 08:17:53 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం...

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్

Date : 14 January 2026 09:50 PM Views : 157

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ముగ్గుల పోటీలు భారతీయ మహిళల సృజనాత్మక నిలువెత్తున నిదర్శనమని మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ అన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరయ్, ఆ లైవ్ కార్యక్రమంలో భాగంగా రేగోడ్ మండలం చౌదరిపల్లి గ్రామంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఇంటి ముందర వేసే ప్రతి ముగ్గు కేవలం అలంకరణ మాత్రమే కాకుండా, మన సంస్కృతి, విలువలు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం (డ్రంక్ అండ్ డ్రైవ్), అతివేగాన్ని నివారించడం, రోడ్డు పై ఉన్న ట్రాఫిక్ సూచికలను గమనిస్తూ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే అనేక ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను తప్పనిసరిగా అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమని అదనపు ఎస్పీ అన్నారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. పోలీస్ శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే రోడ్డు ప్రమాదాలనివారణ సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేగోడ్ ఎస్ఐ పోచయ్య, గ్రామ సర్పంచ్ రాయిపల్లి సురేందర్, గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :