ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంథని సమీకృత హాస్టల్ భవనంలో ఎమ్మార్వో ఆఫీస్ నిర్వహణను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం విద్యార్థులతో కలిపి ధర్నా చేయడం జరిగింది. అక్రమంగా అధికారులు పోలీసులను పంపించి దౌర్జన్యంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ మంథనిలోని సమీకృత హాస్టల్లో 70 మంది విద్యార్థులు ఉంటున్నారు. సమీకృత డివిజన్ ఆఫీస్ నిర్మాణం చేయడం కోసం అప్రస్తుత తహసీల్దార్ కార్యాలయంను సమీకృత బాలుర వసతి గృహంలోకి తరలిస్తున్నారు. ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఎమ్మార్వో ఆఫీస్ని పెట్టడం వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, ఎమ్మార్వో ఆఫీస్ నిర్వహణ కోసం ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించినటువంటి భవనాలలో ఆఫీస్ నిర్వహణ చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఫీస్ నిర్వారణ ఇక్కడ ఎందుకు చేస్తున్నారని ఏ అధికారిని అడిగినా కూడా కలెక్టర్ ఉత్తర్వులు మేరకు చేస్తున్నామని చెప్తున్నారని విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అధికారులే విద్యార్థులను ఇబ్బందులు పెట్టే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎమ్మార్వో ఆఫీస్ నిర్వహణ కోసం రెడ్డి సంక్షేమ భవనం మరియు ఐకెపి భవనం కూడా ఉన్నాయి కావున అధికారులు విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకొని ఎమ్మార్వో ఆఫీస్ నిర్వహణను ఆ భవనాలలో చేసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో కూడా మంథని sc బాలికల హాస్టల్ను కూలగొట్టి మంథని మున్సిపల్ ఆఫీస్కు కేటాయించడం జరిగింది. ఇలా కూలగొట్టుకుంటూ పోతే హాస్టల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. కావున వెంటనే మంత్రివర్యులు స్పందించి ఆఫీస్ నిర్వహణను హాస్టల్లో కాకుండా వేరే భవనాలల్లో నిర్వహించే విధంగా చూడాలని కోరారు. ఈ ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజకుమార్ నాయకులు తిరుపతి, సందీప్, రాజ్ కుమార్, శ్రీశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News