ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎల్‌నినో ప్రభావంతో రైతన్నలు నష్టపోతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అనుకున్న సమయానికి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. దానికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు వెళ్తే బాగుటుందని సూచించారు.బుధవారం మంత్రి తుమ్మల పాత్రికేయులతో తో మాట్లాడారు.రేపటి నుంచి ఆగస్టు రెండో వారంలోగా ఆరుతడి పంటలపైనఅవగాహన కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయా జిల్లాల వారీగా వివరాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పంటల కోసం అన్నదాతలకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఇంకా నిర్ణయించలేదని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ కర్తవ్యమని తెలిపారు. కంది, సొయా బీన్, పెసర, మినుము, జొన్న, సజ్జల సాగుకు రైతులు సిద్ధపడాలని సూచించారు. వర్షాల మీద ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Admin
E Nivas News