Wednesday, 01 April 2026 01:55:59 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

ఇంధనంపై అదనపు పన్ను తగ్గింపుతగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు..

Date : 27 March 2026 09:32 PM Views : 49

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నవేళ భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నిర్ణయం ప్రకారం, పెట్రోల్‌పై లీటరుకు రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. దీనితో పెట్రోల్‌పై గతంలో ఉన్న రూ. 13 సుంకం ఇప్పుడు రూ. 3కి చేరింది. అలాగే, డీజిల్‌పై గతంలో ఉన్న రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ, దానిని సున్నాకు తగ్గించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సమాచారం. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ప్రపంచ ముడిచమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌పై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ యుద్ధానికి ముందు భారత్ తన చమురు అవసరాల్లో 12 నుంచి 15 శాతం వరకు ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకునేది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా సామాన్యులపై ఆ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణ లోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :