ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వైద్యుడు లింగ రెడ్డి ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యం పై గురువారంఅవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా మానసిక వైద్యాన్నిపుణుడు సునీల్ కుమార్ పిల్లల మానసిక సమస్యలపై అవగాహన కల్పించారు. పరీక్షల ఒత్తిడిని ఎలా నివారించుకోవాలో తెలిపారు . అలాగే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చక్కగా వివరించారు. అంతేకాదు ఏవైనా మానసికంగా బాధలు అనిపిస్తే కచ్చితంగా పక్కవారితో పంచుకోవాలని ఈ విధంగా చేస్తే చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. చెప్పుకోలేని సమస్య ఎదురైనప్పుడు, మొహమాట పడకుండా 14416 టోల్ ఫ్రీ నెంబరికి కాల్ చేసి సమస్య వివరించాలని తప్పకుండా మానసిక సమస్య తీరుతుందని చెప్పారు. తర్వాత ఆరోగ్య వైద్యాధికారి సతీష్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు చేయవలసిన అత్యవసర ప్రాథమిక చికిత్స అయినటువంటి సి పి ఆర్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులతో కూడా ప్రాక్టీస్ చేయించారు. జిల్లా అధికారి లింగారెడ్డి ధూమపానం మనుషుల ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో వివరించారు. తర్వాత విద్యార్థులు తమకున్న సందేహాలను నివృత్తి పరుచుకున్నారు. తమ అభిప్రాయాలను వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ రమా కళ్యాణి మాట్లాడుతూ పిల్లలకు తెలియనటువంటి చక్కటి విషయాలను వివరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమా కళ్యాణి , వైస్ ప్రిన్సిపాల్ గీతాంజలి , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ శిరీష, హెల్త్ సూపర్వైజర్ పల్లవి, అలాగే మెంటల్ వెల్ బీయింగ్ ట్రైనర్స్ గీతాంజలి, సుజాత ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థు పాల్గొన్నారు.
Admin
E Nivas News