ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళపై వేధింపులకు పాల్పడినట్లైతే షీ టీం ను ఆశ్రయించాలని రామగుండం పోలీస్ షీ టీం పోలీసులు సూచించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు షీ టీమ్ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, టీ-సేఫ్ యాప్ మరియు షీ టీమ్స్ సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు. హెల్ప్‌లైన్ నంబర్లు డయల్ 100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385 అని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలో వివరించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వారికి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. మహిళలు ఎటువంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన షీ టీమ్స్ విధులు, సేవల గురించి ఉపాధి హామీ కూలీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి,ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నయ్య మరియు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Admin
E Nivas News