ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపానికి సోమవారం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం మాట్లాడుతూ, ఇంద్రవెల్లి పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ఆదివాసీ అమరవీరుల త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన అమరవీరుల స్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకమని అన్నారు.ఆదివాసీ సమాజ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమరవీరులత్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News