Friday, 31 July 2026 10:43:01 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

చెన్నూరులో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

Date : 24 January 2026 07:46 PM Views : 248

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పలు కీలక అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శనివారం శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ. 1.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు చెన్నూరు పట్టణ రూపురేఖలను మార్చేలా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముందుగా చెన్నూరు పట్టణ ప్రవేశ ద్వారం వద్ద నిర్మించనున్న కమాన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం 7వ వార్డు వడ్డేపల్లిలో కల్వర్ట్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. దీంతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న వర్షాకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా చెన్నూరు మార్కెట్ ప్రాంతంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. మార్కెట్ మౌలిక వసతులు మెరుగుపడితే వ్యాపారులకు, ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి కోసం కృషి చేస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :