Friday, 31 July 2026 06:28:47 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆదిలాబాద్ లో ఏర్పాటును అన్ని వసతులతో నిర్మించాలని రక్షణ శాఖ మంత్రి కి విజ్ఞప్తి..

Date : 23 June 2026 12:31 AM Views : 60

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భార‌త వాయు సేన (ఐఏఎఫ్ ) ఆధ్వ‌ర్యంలో నిర్మించ‌నున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అన్ని వ‌స‌తుల‌తో అభివృద్ధి చేయాల‌ని రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలోని ర‌క్ష‌ణ శాఖ కార్యాల‌యం క‌ర్త‌వ్య భ‌వ‌న్‌లో రాజ్‌నాథ్ సింగ్ తో సోమవారంభేటీ అయ్యారు.ఈ సంద‌ర్భంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌లాయించినందుకు రాజ్‌నాథ్ సింగ్‌ కి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒక‌టైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌, యుటిలిటీస్ బ‌ద‌లాయింపు అంశాల్లో పూర్తిగా స‌హ‌కరిస్తామ‌ని కేంద్ర మంత్రి కి తెలియ‌జేశారు. ఆదిలాబాద్‌లో భార‌తీయవాయు సేన ఆధ్వ‌ర్యంలో రానున్న విమానాశ్రయం దేశ స‌మ‌గ్ర‌త‌, ర‌క్ష‌ణ‌కు సంబంధించిన అంశమైనందున‌, దానిని భారీగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. భార‌త వాయు సేన టెర్మిన‌ల్‌తోపాటు ప్ర‌యాణికుల సౌక‌ర్యార్ధం నిర్మించ‌నున్న పౌర విమాన‌యాన శాఖ‌కు చెందినటెర్మిన‌ల్ బిల్డింగ్‌తో పాటుగా కార్గో, ఎంఆర్‌వో, హ్యాంగ‌ర్ సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. ఇటీవ‌ల మ‌ధ్య ఆసియాలో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ త‌మ హ్యాంగ‌ర్స్‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి స‌రైన ప్ర‌దేశాల‌ను అన్వేషిస్తున్నాయ‌ని, హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అత్యంత అనుకూల‌మైనందున, ఆ దిశ‌గా అభివృద్ధి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. త‌మ కీల‌కమైన ప్రాజెక్టు ఏర్పాటుకు డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దేవ‌ర‌క‌ద్ర స‌మీప ప్ర‌దేశాన్ని ఎంపిక చేసుకున్నందున ఆ ప్రాజెక్ట్‌ను త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: