ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 81 మంది లబ్ధిదారులకు రూ. 16,49,500 సహాయనిధి చెక్కులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సహాయనిధి అమలు శాతాన్ని పెంచాలని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కన్నా ప్రభుత్వానికి ఎక్కువ ఎం ఉంటుందని అన్నారు.నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్ననిరుపేదలు నెరడిగొండలో ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Admin
E Nivas News