Thursday, 30 July 2026 11:33:02 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి...

జిల్లా కలెక్టర్ కె.హరిత

Date : 23 February 2026 10:50 PM Views : 161

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో పండుగలను మత సామరస్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, శిక్షణ ఐ ఎఫ్ ఎస్ అధికారి భార్గవ్ కుమార్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసమును ప్రజలు శాంతియుతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. మసీదుల వద్ద ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ప్రార్థన సమయాలలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ ను ఆదేశించారు. మసీదుల వద్ద ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీస్ శాఖ సమన్వయం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో పండుగలను శాంతియుత వాతావరణంలో మత సామరస్యంతో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, విద్యుత్తు శాఖ ఎస్ ఈ ఉత్తం జాడే, తహసిల్దార్లు రియాజ్, మధుకర్, మున్సిపల్ కమిషనర్ గజానన్, ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ అహ్మద్, శాంతి కమిటీ సభ్యులు,మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: