Friday, 19 June 2026 01:27:47 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడిని ఖండించండి

Date : 12 October 2025 07:24 PM Views : 297

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దేశ అత్యున్నత మైన న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడి చెయ్యడానికి సిద్దపడటం సరి కాదని దాన్ని సనాతనం తో ముడిపెట్టడం దివాలు కోరు రాజకీయమని వెంటనే అతనిని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చెయ్యాలని కోరుతూ ఆదివారం లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి దేవి పోచన్న మాట్లాడుతూ సనాతన దర్మం పేరిట హింసను ప్రోత్సహస్తే సనాతన దర్మం కూడా ఒప్పుకోదని, సనాతన దర్మం పేరిట దాడులు, చంపడాలు, బెదిరింపులు బీజేపీ అధికారంలోకి వచ్చాక పెరిగాయని, సనాతన దర్మం పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారని భావిస్తే అది తప్పుడు ఉద్దేశ్యమని కావున సనాతన ధర్మం పేరిట దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కోట్లాది హిందువులు ఆరాధించే సమ్మక్క సారలమ్మలను కించపరుస్తూ మాట్లాడిన హిందూ మతానికి తప్పుడు అర్ధం ఇచ్చిన చిన్నజీయర్ ను ఏమనలేదని ఎందుకంటె అయిన బ్రాహ్మణుడని,అదే బ్రాహ్మణుడు పై ఇలాంటి దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక దళిత బిడ్డ ఉన్నత స్థానంలో కూర్చోవడం సహించలేని ఆధిపత్య కుల దురహంకారమే ఆ రాకేష్ కిషోర్ ను ఉసిగొలిపిందన్న సత్యం అందరికీ అర్థమవుతుందని మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినమైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. గవాయి గారిపై జరిగిన దాడి ప్రపంచ దేశాల ముందు భారత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి కి జరిగిన అవమానం అన్నారు. ఇది న్యాయమూర్తి పై జరిగిన దాడి కాదని రాజ్యాంగం పై,బావ వ్యక్తికరణ పై జరిగిన దాడని అన్నారు. ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు దేవి జగన్, ఆవునూరి మురళి, అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి ఆవునూరు ప్రసాద్, నాయకులు కామిల్ల రమేష్, దేవి భీమయ్య ఉరిమెట్ల అరవింద్, ఆదర్శ్, పల్లికొండ శ్రీనివాస్, ఆవునూరు రమేష్, దేవి సిద్దు దానపెళ్లి జమీస్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: