ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపైన తక్షణమే విచారణ మొదలుపెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు. మే 8న ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేసు వివరాలను సీఎంకు డీజీపీ వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలియజేశారు. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని డీజీపీ ఆనంద్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బండి భగీరథ్‌పై ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు వచ్చింది. తనను భగీరథ్ వేధిస్తున్నారని, పోక్సో కింద కేసు నమోదు చేయాలని ఓ మైనర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు భగీరథ్‌పై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయనట్లు తెలుస్తోంది. ఈ అంశం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి కుమారుడిని ప్రభుత్వమే కాపాడుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది.
Admin
E Nivas News