ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశభవ భవిష్యత్తు యువత చేతిలో ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. సోమవారం జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని యువజన కేంద్రిత కార్యక్రమంలో ప్రముఖ ప్యానలిస్టుగా పాల్గొన్నారు.సిఐఐ – యంగ్ ఇండియన్స్ (హైదరాబాద్ చాప్టర్) ఆధ్వర్యంలో, (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్), హైదరాబాద్ లో “యూత్ ఇన్ యాక్షన్: 2047 దిశగా భారతదేశం తదుపరి ఎదుగుదలకు నాయకత్వం” అనే అంశంపై నిర్వహించిన ప్యానల్ చర్చలో ఎంపీ వంశీకృష్ణ పాల్గొని యువత పాత్రపై కీలక అభిప్రాయాలువెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి యువతలోనే ఉందని, విద్య, ఉపాధి, సాంకేతికత, సామాజిక బాధ్యతలపై యువత దృష్టి సారిస్తే 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. యువత నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని సమాజాభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎస్ బి విద్యార్థులతో పాటు వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, యువ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News