ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని వంజిరి గ్రామ రైతు వేదికలో జల్ జీవిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన వరి మరియు కంది విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పంటల మార్పిడి ప్రక్రియకు రైతులందరూ సహకరించాలని, అంతర పంటలు వేసి లబ్ధి పొందాలని తెలిపారు. లక్ష బస్తాల మక్కలను ఈసారి కౌటాల మరియు కాగజ్ నగర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించామని, రైతులకు చాలా లాభం జరిగిందని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ మనోహర్, ఏవో రామకృష్ణ, సర్పంచు గౌత్రే లక్ష్మి, ఉపసర్పంచ్ డోంగ్రే భరత్, పిఐసిఎస్ చైర్మన్ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News