ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం పుట్టపాక గ్రామంలో అన్నదాత ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో జీనెక్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు క్షేత్ర ప్రదర్శన విజయవంతంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు చాట్లపల్లి రాజయ్య తన ఎనిమిది ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో జీనెక్స్ కంపెనీకి చెందిన 'అయాన్ 2025' వరి రకాన్ని సాగు చేశారు. శనివారం, ఈ క్షేత్రాన్ని ఇతర రైతులతో కలిసి జీనెక్స్ ప్రతినిధులు సందర్శించి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సాగు చేసిన రైతు చాట్లపల్లి రాజయ్య మాట్లాడుతూ.. "అయాన్ 2025 రకాన్ని సాగు చేయడం ద్వారా ఎటువంటి పురుగు మందులు వాడకుండానే చాలా మంచి దిగుబడి సాధించగలిగాను. ఇది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది" అని తెలిపారు. జీనెక్స్ కంపెనీ ప్రతినిధి రాజశేఖర్ మాట్లాడుతూ తమ కంపెనీ లక్ష్యం రైతులకు అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన వరి రకాలను అందించడమేనని పునరుద్ఘాటించారు. రాబోవు వేసంగి లో జినెక్స్ సీడ్స్ వారి దొడ్డు రకాలైన రాజా, తోప్ సింగ్ రకాలకు అన్నదాతలు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ క్షేత్ర ప్రదర్శనలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కొత్త వంగడంపై ఆసక్తి చూపారు.
Admin
E Nivas News