ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రైతు పండించిన ప్రతి పంటలు బోనస్ ఇవ్వాలి బోథ్ నియోజకవర్గ ప్రజల ప్రధాన పంటలైన పత్తి,సోయా,మొక్క జొన్న, శనగ,వేరు శనగ పంటలకు బోనస్ ఇవ్వాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం బోథ్ మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేఅనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతుల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మొక్క జొన్న తో పాటు సోయాబిన్ మరియు పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి అని అన్నారు. కిషన్ కపాస్ యాప్ ద్వారా రైతులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఆ యాప్ ఇప్పుడే అమలు చేయకుండా క్రమ క్రమంగా యాప్ మొదలు పెట్టాలి అని అన్నారు. చాలా మంది రైతుల వద్ద సెల్ ఫోన్లు లేవు ఉన్న నెట్వర్కులు లేవు కావున ఈ ఒకటి రెండు సంవత్సరాలు పాత పద్ధతి ద్వారానే పత్తి కొనుగోలు చేయాలి అని అన్నారు.అదేవిధంగా రైతులు ఎవరుకూడా దళారులకు పంట అమ్మ మోసపోవద్దు అని అన్నారు తిరలోనే ఈ ప్రభుత్వంతో పోరాడి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే విధంగా చేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బి.ఆర్. ఎస్ నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News