ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ల్లో చైర్‌పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల ప్రక్రియకు అధికారులు శనివారం సర్వం సిద్ధం చేశారు. గతంలో కోర్టు కేసుల కారణంగా ఈ ఎన్ని కలు వాయిదా పడుతూ వచ్చాయి. హైకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం ఎట్టకేలకు శనివారం ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణలో రెండుచోట్ల బీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధి క్యం సాధించింది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్ పర్సన్ అభ్యర్థిగా గొడిసెల సంధ్యారాణి,( బి ఆర్ ఎస్ ) వైస్ చైర్ పర్సన్ గా మిట్టపల్లి సరిత( సిపిఐ ) లు ఎన్నుకోబడ్డారు. అలాగే ఖానాపూర్ మున్సిపాలిటీ లో ఎమ్మెల్యే గేమ్ ఆడుతున్నారంటూ టిఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ లోకి చొచ్చుకొని పోయి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి ఇప్పటికీ గందరగోళంగానే ఉంది .రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు గాను చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు అవసరమైన 15 మంది కౌన్సిలర్లను బీఆర్‌ఎస్ గెల్చుకున్నది. మున్సిపల్ చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి, ఎన్నిక కాగాబీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల కు వైస్ ఛైర్మన్ పదవి వరించింది.
Admin
E Nivas News