Thursday, 30 July 2026 09:51:13 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మహిళల రక్షణ, భద్రత కోసం మఫ్టి లో షి టీమ్స్ నిఘా...! సోషల్ మీడియా మద్యమాల పట్ల జాగ్రత్తగా ఉండాలి

పోలీస్ అంబర్ కిషోర్ ఝా

Date : 04 December 2025 01:04 AM Views : 176

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రదిని తెలంగాణ( ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రదినిది) లక్షెట్టిపేట డిసెంబర్ 3 :- మహిళలు, యువతుల రక్షణ కోసమే షీటీం ఉందని, మహిళల రక్షణ, భద్రత పోలీసు బాధ్యత లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో షీ టీమ్స్ స్కూల్, కళాశాలలు, ఆఫీస్ లు ముగిసే సమయానికి స్కూల్స్, కళాశాల, బస్టాండ్‌ ప్రధాన కూడళ్ళ వద్ద ఎక్కువగా బాలికలు, మహిళలు ప్రయాణాలు చేసే సమయంలో వారిని ఏవైనా ఇబ్బందులు పెడుతున్నారా అని క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్య సాధారణ జనాల వలె మఫ్టీ లో ఉంటూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని బుధవారం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మహిళల రక్షణ కోసమే షీటీం పని చేస్తుందని, కమిషనరేట్ పరిధిలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో కేసు, గుడచ్, బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్య వచ్చినప్పుడు 100కు డయల్ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. టీ సేఫ్ యాప్, మహిళల భద్రత, రక్షణ చర్యలు, తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్య పరుస్తున్నామని వివరించారు. షీ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, లేదా ఆన్లైన్ క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తామన్నారు. ఎవరైనా వేధింపులు, అసభ్య ప్రవర్తన, మాట్లాడడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బాలికలు, మహిళలు ఎక్కడ ఉన్నా భద్రతగా ఉండటం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత. పోలీసు శాఖ మీకు అండగా ఉంటుం దన్నారు. మీ భద్రత కోసం 24 గంటలు సిద్ధంగా ఉంటామని, తప్పు చేస్తున్న వారి మీద చర్య తీసుకోవడానికి మీ సమాచారమే వారిపై చట్ట పరమైన చర్యలకు ఆధారం అన్నారు. మహిళలు అత్యవసర పరిస్థితులలో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700, పెద్దపల్లి జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 మంచిర్యాల జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 కి కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు* కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సీపీ సూచించారు. నవంబర్–2025 నెలలో రామగుండం కమిషనరేట్‌ షీ టీమ్స్ వద్ద మొత్తం పిటిషన్లు 68 వచ్చాయనిమొత్తం 68 పిటిషన్లలో 15 పిటిషన్లు రామగుండం షీ టీం వాట్సాప్ నంబర్ ద్వారా మరియు ప్రత్యక్షంగా షీ టీమ్స్ రామగుండం (పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు) కార్యాలయాలకు ఇవ్వబడినవి. 53 – రెడ్ హ్యాండెడ్ పిటిషన్ లు రాగా ఈ 15 పిటిషన్లలో ఎఫ్ ఐ ఆర్ – 04, పెట్టీకేసులు – 04, కౌన్సిలింగ్ నిర్వహణ చేసి 02 కేసులనుహెచ్చరించి వదిలివేసినవి – 05 ఉన్నాయన్నారు.షీ టీమ్స్ పెద్దపల్లి & మంచిర్యాల జిల్లాల్లో పబ్లిక్ ఉండే ప్రాంతాలు, పార్కులు, షాపింగ్ మాల్ ప్రాంతాల్లో డీకాయ్ ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 60 మంది ఆఖతాయి లను పట్టుకుని పెట్టీకేసులు నమోదు చేసి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేసి హెచ్చరించడం జరిగిందన్నారు. మొత్తం 53 రెడ్ హ్యాండెడ్ కేసుల్లో పెట్టీకేసులు – 05, కౌన్సిలింగ్ – 26, హెచ్చరించి వదిలివేయడం జరిగిందన్నారు. నవంబర్ 2025 లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.పెద్దపల్లి జిల్లా 29మంచిర్యాల జిల్లా 34మొత్తం 63 అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. నవంబర్–2025 లో సందర్శించిన హాట్ స్పాట్స్, పెద్దపల్లి జిల్లా 117,మంచిర్యాల జిల్లా 115మొత్తం 232 గుర్తించడం జరిగిందన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :