ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : నేటి నుంచి సంగారెడ్డిలో నిర్వహించే తెలంగాణ 69వ రాష్ట్రస్థాయి ఆటలు పోటీలకు EKLASPUR ZPHS పాఠశాలలో 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న మొగిలి సింధుజ ఎన్నికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన అండర్ 14 బాలికల కబడ్డీ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఆటలు పోటీలకు ఎంపికైన సందర్భంగా సింధుజను పాఠశాల పిడి డాక్టర్ రవి దోమటి, పాఠశాల సిబ్బంది పాఠశాల హెచ్ఎంసీ కమిటీ గ్రామ ప్రజలు అభినందించారు.
Admin
E Nivas News