Thursday, 30 July 2026 04:01:06 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

Date : 28 July 2026 09:54 PM Views : 36

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : రాష్ట్ర న్యాయ సేవాధి కార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలంలోని, సంజీవనగర్ తాండ నందు జులై 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్జి మాట్లాడుతు ప్రకృతి ని పర్యావరనాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరారు. మానవ వన్య ప్రాణి దాడుల బాధితులకు న్యాయం పొందేందుకు సంబంధించిన జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ పథకం 2025 అమలు పై తో అటవీ సరిహద్దు ప్రాంతాలలో వ్యవసాయ పొలాలలో చిరుతలు, పులులు, ఏనుగులు, అడవి పందుల దాడుల వలన ప్రాణాలు కోల్పోయిన మరియు పశువులను, పంటలను కోల్పోయిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు గవర్నమెంట్ నుండి నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు. గిరిజనులకు ఏవైనా సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 పై కాల్ చేస్తే వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామ చంద్రరావు మాట్లడుతూ అడవి జంతువుల బాధితులకు పరిహారం అందించేందుకు అటవీశాఖ అధికారులు మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారని తెలిపారు. ఐటీడిఐ ప్రాజెక్ట్ ఆఫీసర్ గుండాల నాయక్ మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2026 లో ప్రాజెక్ట్ హనుమాన్ను ప్రారంభించి వన్యప్రాణుల దాడుల బాధితులకు తక్షణ వైద్య సహాయం మరియు వేగవంతమైన నష్ట పరిహారాలను అందిస్తుందని తెలిపారు. ఆత్మకూరు డియస్పి ఆర్.రామాంజి నాయక్ మాట్లడుతూ గిరిజనులు అటవీ భూములను కాపాడుకోవాలని చెట్లను కొట్టి వేయకుండా ప్రకృతి ని కాపాడాలని కోరారు. అనంతరం గిరిజనులకు నంద్యాల డిస్టిక్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్, ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మి కుమారి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాకిర్ హుస్సేన్ , ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ గుండాల నాయక్, ఆత్మకూరు ఎంపీడీవో నాగేంద్రుడు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఆత్మకూరు న్యాయ వాదులు భాస్కర్, బతుకులయ్య, అంకిరాజు, ప్యారా లీగల్ వాలెంటీర్స్ రమేష్, బలరాముడు, రాబిన్ సన్ రాజు, జుల్ఫికర్, యస్.యన్.తాండ సర్పంచ్ నాగులు నాయక్, డాక్టర్ పవన్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మరియు ఐటీడిఐ అధికారులు, జిల్లా రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: