ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నియమించిన నందికొట్కూరు వార్డు అబ్జర్వర్‌గా గంజాయి.నాగముని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో డోర్ టు డోర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సర్వేలో భాగంగా 75, 76, 57, 58, 59, 60, 61, 62 బూత్‌లలో టీడీపీ స్థానిక నాయకులను కలిసి, అక్కడి ఓటు బ్యాంక్ పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రతి వార్డులో పార్టీకి ఉన్న బలం, సమస్యలు, ఓటర్ల అభిప్రాయం వంటి అంశాలపై వివరాలు సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ & టిడిపి వార్డు అబ్జర్వర్- గంజాయి.నాగముని మాట్లాడుతూ—కొన్ని వార్డులలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడానికి కారణాలు వార్డు నాయకులతో తెలుసుకున్నామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఓటు బ్యాంకును బలోపేతం చేసే విధానంపై వార్డు ఇంచార్జీలకు, నాయకులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News