ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : ఓర్వకల్లు మండలంలోని, కేతవరం గ్రామంలో "పొలం-పిలుస్తోంది" కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, అగ్రికల్చర్ అధికారిణి మధుమతి లు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం కల్పించిన అన్ని సబ్సిడీలను ఉపయోగించుకొని మంచి పంట దిగుబడులు సాధించాలని కోరారు. వివిధ పంటలకు వస్తున్న తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, క్రిమిసంహారక మందుల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల కన్వీనర్ బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, బాలిశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అగ్రికల్చర్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News