Friday, 31 July 2026 04:31:52 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గత 24 సంవత్సరాలుగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాలలో పాల్గొంటున్న పాములపాడు సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ

Date : 22 December 2025 10:04 PM Views : 292

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలో, సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గత 24 సంవత్సరాలుగా అనేక సమావేశ సేవా కార్యక్రమాలతో పాటు, ప్రత్యేకంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాలలో విరివిగా పాల్గొని, విజయవంతం చేయడానికి కృషి చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలీ తెలియజేశారు. ఈ సందర్భంగా సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలి మాట్లాడుతూ 2002వ సంవత్సరం నుండి నేటి వరకు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాల అవగాహన ర్యాలీలలో, ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ లో మా స్వచ్చంద సంస్థ కొరకు కేటాయించిన బూత్ నెంబర్-27లో ప్రయాణంలో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ పోలియో వ్యాధి బారిన పడకుండా, ముందు జాగ్రత్తగా బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలలో ఎక్కే వారిని, దిగేవారిని గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చేవారు, మరియు ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. మొత్తానికి దేశంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, స్వచ్ఛత సంస్థల ప్రతినిధులు, అంగన్వాడీ వర్కర్లు, ప్రభుత్వ అధికారులతో కలిసి దేశంలో పోలియో వ్యాధిని నిర్మూలించడానికి పోలియో వ్యాక్సిడేషన్ కార్యక్రమం అమలు చేస్తూ, విశేష కృషి చేయడం గర్వకారణం అన్నారు. ఈ 2025, డిసెంబర్-21,22,23 వ తేదీలలో నిర్వహించిన పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మాతోపాటు, పాములపాడు పీహెచ్సీ వైద్యాధికారిణి- ఈ.వి.నాగలక్ష్మి దేవి, డాక్టర్- ఎం.మహమ్మద్ బేక్, మండల స్పెషల్ ఆఫీసర్ ఎం.ఎన్.వి.రాజు, ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, హెల్త్ ఎడ్యుకేటర్ జి.మల్లికార్జున, ఎంపీహెచ్ఏ (మేల్)-డి.రామ్ నాయక్, ఎంపిహెచ్ఎస్ (మేల్) ఏం.మద్దయ్య, ఫార్మసిస్ట్- ఎస్.మూస సలాం, సిహెచ్ఓ-అన్నమ్మ, మద్దూరు సిహెచ్ఓ- కే.రేణుకా దేవి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్-లింగాల.నాగరాజు, భూ రీసర్వే డిటి- వి.సుప్రియా, ఎంఎన్ఓ లు-సి.హరికృష్ణ, ఎన్.శాలు, ఎస్ఎడబ్ల్యూ-ఎన్.పుల్లయ్య, వీఆర్వో- వై.శివన్న, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వి.ప్రసాద రావు, పాములపాడు గ్రామ సర్పంచ్- మేకల.భాగ్యమ్మ, టిడిపి నాయకులు తిమ్మారెడ్డి, ఎం.రాజశేఖర్, డీలర్ నాగభూషణం, తదితర వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పిల్లలకు పోలియో చుక్కలు వేసి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :