ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన మాలల వనభోజన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని మాల అందరితో కలిసి మాలల సమస్యలపై చర్చించడం జరిగింది. అదేవిధంగా మాలల అభివృద్ధి గురించి, కుటుంబాల అభివృద్ధి గురించి, మాలల ఐక్యత గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మాల సోదరులతో కలిసి బంతి వనభోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ, శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
E Nivas News