ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల పర్యటనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్-కే.ఎస్.జవహర్ కు డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు పాములపాడు మండలంలోని, మిట్టకందాల, మద్దూరు గ్రామాల ఎస్సీలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోనీ, మిట్టకందాల గ్రామంలో సర్వేనెంబర్ 568, 569 లలో సుమారు తొమ్మిది ఎకరాల యాభై ఏడు చెట్లు 264 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు మంజూరు చేసే విధంగా అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తే అప్పటి ఎమ్మార్వో గ్రామ తీర్మానం లేఔట్ వేసి లబ్ధిదారుల కు పట్టాలు మంజూరు చేయాలంటే సమస్య సిసిఎల్ఏ లో సమస్య ఉన్నందున సమస్య పరిష్కారం కావడం లేదని సీసీఎల్ఏ లో సమస్యలు పరిష్కరించి వెంటనే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని అలాగే పాములపాడు మండలంలోని, మిట్టకందాల, మద్దూరు గ్రామాలలో ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నందున శుభకార్యాలు సమావేశాలు నిర్వహించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ప్రభుత్వం ఈ రెండు గ్రామాలకు కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్.పుల్లమ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News