Thursday, 30 July 2026 09:55:41 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

శ్రీ బాగ్ ఓడంబడికను వెంటనే అమలు చేయాలి - ఓడంబడిక జరిగి 90 ఏళ్లు అయినా అమలు కాకపోవడం బాధాకరం

డాక్టర్ డి.నాగన్న(సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు)

Date : 17 November 2025 09:59 AM Views : 147

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీ బాగ్ ఓడంబడిక ఒప్పందాన్ని అమలు చేయాలని వాకర్స్ అసోసియేషన్ మరియు సామాజిక రాయలసీమ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని, పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్లే కార్డులు పట్టుకొని, ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు & సామాజికవేత్త డాక్టర్ డి.నాగన్న మాట్లాడుతూ శ్రీ బాగ్ ఒప్పందం జరిగి నేటికీ దాదాపుగా 90 సంవత్సరాలు అయిందన్నారు. ఈ ఒప్పందంలోని 4 అంశాలు ఏ ఒక్కటి ఇంతవరకు రాయలసీమ ప్రజలు సాధించుకోవడంలో విఫలమైనారనీ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ బాగ్ ఒప్పందంలోని అంశాలు అనంతపురంలో యూనివర్సిటీ కేంద్రాన్ని స్థాపించాలనీ, కృష్ణ, తుంగభద్ర జలాలలో రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనీ, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైకోర్టు గాని రాజధాని గాని రాయలసీమ ప్రజలు ఏది కోరితే అది ఇవ్వాలనీ, రాయలసీమ ప్రాంతంలో నియోజకవర్గాలను పెంచి, కోస్తా జిల్లాలతో సమానంగా ఎమ్మెల్యే స్థానాలు ఉండేవిధంగా చూడాలనీ ప్లే కార్డులో పట్టుకొని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ - గంజి.రాజశేఖర్, లలిత సీడ్స్ ప్రోప్రెటర్- శ్రీనివాసులు గౌడ్, లాయర్ నూర్ అహమ్మద్, భాస్కర్ రెడ్డి, గోవర్ధన్, రమేష్ బాబు, రఫిక్, టీచర్ రఘుస్వామి, వెంకటేష్, సీనియర్ జర్నలిస్టు సుబ్బారెడ్డి, సెరికల్చర్ అధికారి సుంకన్న, నాగేష్, రాయలసీమలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :