Friday, 31 July 2026 04:54:48 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జగన్ వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వంతో నిజమైన భరోసా

ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 19 November 2025 08:23 PM Views : 241

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గం రైతు జీవితానికి నమ్మకంగా నిలిచిందని చంద్రబాబు తెచ్చిన' అన్నదాత సుఖీభవ' పథకం అని , కానీ జగన్ హయాంలో రైతు సంక్షేమం కేవలం ఓటు రాజకీయాలకే పరిమితమైందని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగమైన అన్నదాత సుఖీభవ హామీని నెరవేర్చేందుకు 2025 ఆగస్టు 2 వ తేదిన తొలి విడుత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మరియు రెండో విడతగా ఈరోజు నవంబర్ 19వ తేదీన నిధులు విడుదల చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించిందని. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.20వేలు ఇస్తున్నామని నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నందికొట్కూరు మండలంలోని, బొల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ 2025 రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి లతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ ఈరోజు 19వ తేదీన 'అన్నదాత సుఖీభవ' పథకం అమలుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధమైందని. ఇదే రోజు పీఎం కిసాన్ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుందని. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వైయస్సార్ జిల్లాలోని, కమలాపురం నియోజకవర్గం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించి, రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారని. అభివృద్ధికి ప్రాంతీయ బేధం లేదని, రైతే దైవం అని చాటిచెప్పడానికి దీనిని ఎంచుకున్నారన్నారు. *అన్నదాతకు డబుల్ ధమాకా రూ. 7 వేల సాయం* అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకాల రెండవ విడతగా 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు జమ అవుతుందన్నారు. రెండు విడతల్లో కలిపి పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6309.44 కోట్ల రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిందన్నారు . రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.2342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.792.09 కోట్లు రైతులకు చెల్లిస్తుందన్నారు. పిఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతలో ఆగస్టు నెలలో రూ.3174 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇది రైతు శ్రేయస్సు పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ వారీగా అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ లబ్ధిదారుల వివరాలు ఈ విధంగా ఉన్నాయన్నారు. నందికొట్కూరు మండలం లోని 5172 మంది అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు లబ్ధి పొందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 2.59 కోట్ల రూపాయలు , కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 0.89 కోట్ల రూపాయలు మొత్తం 3.47 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని అన్నారు. పగిడ్యాల మండలంలోని, 3137 మంది అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు లబ్ధి పొందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 1.57 కోట్ల రూపాయలు , కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 0.60 కోట్ల రూపాయలు మొత్తం 2.16 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని అన్నారు. జూపాడుబంగ్లా మండలంలోని, 7157 మంది అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు లబ్ధి పొందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 3.58 కోట్ల రూపాయలు , కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 1.18 కోట్ల రూపాయలు మొత్తం 4.76 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని అన్నారు. మిడ్తూరు మండలంలోని, 8310 మంది అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు లబ్ధి పొందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 4.16 కోట్ల రూపాయలు , కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 1.46 కోట్ల రూపాయలు మొత్తం 5.61 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని అన్నారు. పాములపాడు మండలంలోని, 6865 మంది అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు లబ్ధి పొందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 3.43 కోట్ల రూపాయలు , కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 1.29 కోట్ల రూపాయలు మొత్తం 4.72 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని అన్నారు. కొత్తపల్లి మండలంలోని, 6093 మంది అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు లబ్ధి పొందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 3.05 కోట్ల రూపాయలు , కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 1.17 కోట్ల రూపాయలు మొత్తం 4.21 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ మొత్తం 36734 మంది అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు లబ్ధి పొందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 18.37 కోట్ల రూపాయలు , కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 6.57 కోట్ల రూపాయలు మొత్తం 24.94 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాద రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు దేవల్ల మురళి, పాములపాడు సొసైటీ చైర్మన్- సి.గోవిందు, మద్దూరు సొసైటీ చైర్మన్- వాడాల కె.జనార్దన్ రెడ్డి, మండల కన్వీనర్-జి.రవీంద్రారెడ్డి, నందికొట్కూరు మహిళా నాయకురాలు డాక్టర్ డి.వనజ, బిజెపి సీనియర్ నాయకుడు చల్లా.దామోదర్ రెడ్డి, మద్దూరు తిమ్మారెడ్డి, సొసైటీ చైర్మన్ లు, అగ్రికల్చర్ అధికారులు-ఎం.వి.మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు క్లస్టర్లు, టిడిపి బిజెపి జనసేన కూటమి నాయకులు, రైతులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :