Friday, 31 July 2026 09:30:09 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని

Date : 21 December 2025 07:46 PM Views : 199

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : షూటింగ్ బాల్ కర్నూలు డిస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా కర్నూలు ఔట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 44 వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సీనియర్ పురుషుల విభాగంలో మొదటి స్థానం బాపట్ల జిల్లా జట్టు నిల్వగా,రెండవ స్థానంలో నెల్లూరు జిల్లా జట్టు నిలిచింది. మూడవ స్థానంలో గుంటూరు జిల్లా జట్టు నిలిచింది. స్త్రీల విభాగంలో అనకాపల్లి జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలవగా, బాపట్ల జిల్లా జట్టు రెండవ స్థానంలో, మూడవ స్థానంలో గుంటూరు జిల్లా జట్టు ,నాలుగవ స్థానంలో కర్నూలు జిల్లా జట్టు నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా ఒలంపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్, రాష్ట్ర షూటింగ్ బాల్ సంఘం కార్యదర్శి జోసెఫ్, జిల్లా ఒలంపిక్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సునీల్ కుమార్, జిల్లా డ్రాగన్ బోట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి కృష్ణ లు పోటీలలో గెలపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగ ముని మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే తాము మెచ్చిన క్రీడలను సాధన చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. నేటి ఓటములను రేపటి విజయాలుగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ నాయుడు, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రమణారెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ కృష్ణ, జిల్లా షూటింగ్ బాల్ సంఘం కోశాధికారి నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :