ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో దండగల భూషమ్మ మృతి చెందిన విషయం తెలుసుకోని, మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, గ్రామ నాయకులతో కలిసి ఆమె పార్తివదేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుటుంబానికి సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు తరఫున 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ధైర్యంగా ఉండాలని మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ మృతురాలి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆమె వెంట బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బోనాల భాస్కర్, జనసేన శేషు, తాటిపాటి నాయుడు, మద్దూరు ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News