ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో చనిపోయిన పట్నం.సత్యమయ్య పార్థివ దేహానికి గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ పూలమాలలు వేసి, నివాళులర్పించడం జరిగింది. అనంతరం మాజీ సర్పంచ్ టేకూరి. రామసుబ్బమ్మ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు తరఫున 5000/- వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ధైర్యంగా ఉండాలని అన్ని విధాలుగా తోడుగా ఉంటామని ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో (డిసి)వైస్ చైర్మన్ ఆల్ఫ్రెడ్, మాజీ ఉప సర్పంచ్ సత్యరాజు,మాజీ ఎంపిటిసి శివకుమార్, రాజేష్, ప్రసాద్ రత్నాకర్, కొప్పుల సుధాకర్, సురేష్, పట్నం యోసేపు, కృష్ణ, పట్నం నాగన్న, బోనపల్లె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News