Friday, 31 July 2026 02:47:54 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సమర్ధవంతమైన విపత్తు చర్యలు ప్రమాద తగ్గింపుకు దోహదం చేస్తాయి..! ప్రకృతి విపత్తుల్లో వ్యక్తులతోపాటు, కమ్యూనిటీలు ప్రధానపాత్ర పోషించాలి

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్

Date : 30 January 2026 06:54 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గింపే ధ్యేయంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రధాన లక్ష్యంతో ఈ ఏడాది చివరికల్లా ఆ నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తామని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని, డీవీ మేనర్ హోటల్ లో రాష్ట్ర విపత్తు రిస్క్ తగ్గింపు కోసం రిస్క్ కమ్యూనికేషన్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై రెండు రోజులపాటు నిర్వహించిన వర్క్ షాపులో భాగంగా రెండో రోజు శుక్రవారం డిజాస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తరచుగా సంభవించే తుఫానులు, వరదల సమయంలో సమాచారాన్ని త్వరితగతిన చేరవేసేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్ ను సిద్ధం చేసేలా పంచాయతీరాజ్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మహిళా శిశు సంక్షేమం, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, సమాచార, పౌర సంబంధాల శాఖలకు చెందిన అధికారులు చర్చించడం శుభ పరిణామమన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ (విపత్తు నిర్వహణ) లైఫ్ సైకిల్‌లో ఉండే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వర్క్ షాప్ లో వివరణాత్మకమైన ప్రెజెంటేషన్లు చాలా బాగున్నాయని ప్రశంసించారు. వర్క్ షాప్ లో వివిధ శాఖల అధికారుల సూచనలన్నింటినీ క్రోడీకరించి ఒక 'కోర్ గ్రూప్'ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళికల్లో ఉన్న లోపాలను సవరించి వర్క్ షాపులో సూచనలను ఈ ఏడాది నుంచే పరిగణనలోకి తీసుకుని 'ప్రీ-యాక్టివిటీ ప్లాన్', 'డిజాస్టర్ ప్లాన్'లో పొందుపరుస్తామన్నారు. వర్క్ షాప్‌లో ఉత్సాహంగా పాల్గొన్న వారందరూ ఎస్డీఎమ్ఏ, యూనిసెఫ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఆయా సంస్థలకు రాయబారులుగా (అంబాసిడర్స్) వ్యవహరిస్తారని విశ్వసిస్తున్నానన్నారు. ఇది ముగింపు కాదు, కేవలం ఆరంభం మాత్రమేనని, శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు జిల్లా స్థాయి, మండల స్థాయి, నుంచి స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయ స్థాయి వరకు వెళ్లాలన్నారు.

జిల్లా స్థాయిలో శిక్షణకు ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విపత్తుల సంభవించినప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందించేటప్పుడు వారిని ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా, అర్థమయ్యేలా చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డీఎమ్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్. వెంకట దీపక్, ఎన్ఐడీఎం జేడీ కల్నల్ పీఎస్ రెడ్డి, యూనిసెఫ్ స్పెషలిస్ట్ సీమా, బీవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్స్ ప్రతినిధులు, వివిధ జిల్లాల అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: