Friday, 31 July 2026 12:54:04 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే జిల్లా పోలీసు శాఖ అత్యున్నత ప్రాధాన్యత :– జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్

ఆత్మకూరు సబ్ డివిజన్‌లోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్

Date : 14 July 2026 09:54 PM Views : 48

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : నంద్యాల జిల్లా, ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని, కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా పోలీసు అధికారి సునీల్ షొరాణ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ పోలీస్ స్టేషన్ పరిసరాలు, లాకప్ గదులు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలు, స్టేషన్ రికార్డులు, కేసు నమోదు తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్టేషన్ పరిధిలోని, గ్రామాల పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, గ్రామాల్లో పోలీసింగ్ విధానం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తదుపరి జానాలగూడెం చెంచు గ్రామాన్ని స్వయంగా సందర్శించిన జిల్లా ఎస్పీ గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో ఐకమత్య వాతావరణాన్ని కొనసాగిస్తూ ఎలాంటి గొడవలు, వివాదాలకు తావు ఇవ్వకుండా పరస్పర సహకారంతో జీవించాలని సూచించారు. అలాగే పిల్లలకు విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ప్రతి కుటుంబం కృషి చేయాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే జిల్లా పోలీసు శాఖ యొక్క అత్యున్నత ప్రాధాన్యత. ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి-ఆర్.రామంజి నాయక్ సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :