Thursday, 30 July 2026 12:06:29 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నందికొట్కూరులో ఈనెల 21న నిర్వహిస్తున్న సామాజికవేత్త అబుబక్కర్ సంస్మరమణ సభలో భారీ సంఖ్యలో పాల్గొని, జయప్రదం చేయండి

Date : 20 December 2025 07:33 AM Views : 229

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నంద్యాల జిల్లా ఆవాజ్ కమిటీ అధ్యక్షులు & సంఘసేవకుడు కీర్తిశేషులు అబుబక్కర్ సంస్మరణ సభను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ రహిమాన్ పేర్కొన్నారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పట్టణ కమిటీ సభ్యులందరూ సమావేశమై ఈ నెల 21వ తేదీ ఆదివారం ఆత్మకూరు రోడ్డులో ఉన్న రాయల్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న సంస్మరణ సభ ఏర్పాట్లపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహిమాన్, తదితర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని, అన్ని మండలాల నుంచి అవాజ్ కమిటీ సభ్యులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, ఆత్మీయులు, మిత్రులు, సన్నిహితులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ ఈ సంతాప సభకు తప్పకుండా హాజరుకావాలని కోరడమైనది. ఈ సంస్కరణ సభకు మాజీ ఎమ్మెల్యే& ఆవాజ్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.ఏ.గఫూర్ మరియు ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సుభాన్, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా చిస్తి, లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ రావడం జరుగుతుందని అన్నారు. ఈ సభకు సంఘ సేవకుడు అబుబక్కర్ సానుభూతి పరులందరూ తప్పకుండా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆవాజ్ పట్టణ నాయకులు అబ్దుల్లా, పెయింటర్ రఫీ, మహబూబ్ బాషా, మాభాష, అజ్మతుల్లా, మారుతి నగర్ రఫీ, అబ్దుల్ రెహమాన్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పీ.వెంకటేశ్వర్లు, ఐసా నాయకుడు నాగార్జున, తదితర నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :