Thursday, 30 July 2026 11:38:03 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

12వ పి ఆర్ సి నిధుల ఊసే లేని, ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక బడ్జెట్ ఇది..! విద్యా రంగానికి కేటాయింపులూ అరకోర కేటాయించారు

గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జవహర్ నాయక్

Date : 14 February 2026 10:07 PM Views : 178

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2026 - 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని దానిలో 12వ పిఆర్సి చెల్లింపులు ఇవ్వవలసిన 4 డిఏ ల బకాయిలకు సంబంధించి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని, కనీసం 12వ పి ఆర్ సి పై కనీస ప్రకటన కూడా చేయలేదని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ అన్నారు. ఈ రోజు ఆత్మకూరు పట్టణంలో మీడియాతో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఉద్యోగులకు 11వందల కోట్ల బకాయిలు చెల్లించామని,కాగిత రహిత పెన్షన్ తీసుకురానున్నామని, ఈ హెచ్ ఎస్ కమిటీ వేశామని,మహిళలకు సెలవులు ఇచ్చామని గొప్పగా చెప్పారని, కానీ ఇంకా చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలకోసం ఎలాంటి నిధులు కేటాయింపు చేయలేదని, 12వ పిఆర్సి కమిషన్ చైర్మన్ నియామకం గురించి గానీ, దానికి సంబంధించిన నిధులు, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన 4 డీఏ ల గురించి బడ్జెట్ లో కేటాయింపులుగాని, ప్రసంగంలో ఎక్కడ ప్రస్తావించకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని ఆయన తెలిపారు. 12వ పిఆర్సి చైర్మన్, నాలుగు డిఏలు, ఇతర బకాయిల చెల్లింపులపై ఈ బడ్జెట్ లో కేటాయింపు లేకపోతే మరో బడ్జెట్ వరకు ఎదురుచూడాల్సిందేనా అని ప్రశ్నించారు. 12వ పిఆర్సి గడువు పూర్తయి సుమారుగా మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు చైర్మన్ నియామకం గురించి కూడా మాట్లాడకపోవడం పట్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఈ విషయం ప్రభుత్వం గమనించకపోతే భవిష్యత్తులో తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. పాఠశాల విద్యా రంగానికి సంబంధించి 3,32, 325 కోట్ల బడ్జెట్ లో 32,308 కోట్లు అంటే 9.72 శాతం మాత్రమే కేటాయింపులు చేశారని, గత సంవత్సరం బడ్జెట్ కంటే 0.14% తక్కువ కేటాయింపులు చేయడం ద్వారా ప్రభుత్వ విద్య పట్ల ప్రభుత్వానికి మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందని అన్నారు. ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి రాష్ట్ర బడ్జెట్లలో 30% నిధులు కేటాయించాలని కొఠారి కమీషన్ చెప్పిన సిఫార్సులను ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులకు ఎలాంటి పొంతనలేదని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం, మనబడి మన భవిష్యత్తు కోసం కేటాయింపు నిధులు కూడా గతం కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం 12వ పిఆర్సి చైర్మన్ నియమించాలని, నాలుగు డిఏలు, ఇతర బకాయిలపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించే విధంగా సవరణ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :