Friday, 31 July 2026 12:50:48 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

యువతతో బీజేపీ మరింత బలోపేతం

ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్

Date : 07 July 2026 12:29 AM Views : 55

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : భారతీయ జనతా పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావడం అభినందనీయమని బీజేపీ పాములపాడు మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు సూచనల మేరకు పాములపాడు మండల బీజేపీ కార్యాలయంలో మండల స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ఇన్‌చార్జి మల్లెల కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు చల్లా దామోదర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో పలువురు యువకులు బీజేపీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. సరల్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న డిజిటల్ పరీక్షలు, వాటి ప్రాముఖ్యతపై కార్యకర్తలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల వివరాలను ప్రజలకు చేరవేసి, వాటి ఫలాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, యువతను అధిక సంఖ్యలో పార్టీలోకి తీసుకురావాలని నాయకులు సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు గోపాలకృష్ణయ్య, ప్రవీణ్ కుమార్, నాయకులు బాలస్వామి, రామకృష్ణ, చంద్రారెడ్డి, రుద్రశేఖర్, శివకుమార్, ఉమాశంకర్, తరాల రఘురాం, సూర్యం, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :