Friday, 31 July 2026 06:09:52 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు...

Date : 30 July 2026 09:24 PM Views : 11

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అల్పపీడనద్రోని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు, నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా తెలంగా ణ, మహారాష్ట్రల్లోని ఎగువ ప్రాంతాల్లో వర్షాపాతం తీవ్ర మవడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు కీలకమైన నీటి పారుదల ప్రాజెక్టుల్లో కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం తో ప్రాజెక్టులన్ని నిండుకుండలా కనిపిస్తున్నాయి. జలకళ రైతుల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర ఆనందాన్ని నింపుతోంది. నిజామాబాద్ జిల్లా లోని ప్రతిష్టాత్మక శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తు తం జలాశయంలోకి 12,900 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు నీటి నిల్వ 17.103 టీఎంసీలకు చేరింది. కాకతీయ కాలువ ద్వారా దిగువకు 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. అలాగే, నిర్మల్ జిల్లా లోని సారంగాపూర్ మండలంలో ఉన్న స్వర్ణ ప్రాజెక్టుకు ఉదయం వేళకు నీటి సామర్థ్యం అర టీఎంసీ దాటి, ఇన్ ఫ్లో దాదాపు 10 వేల క్యూసెక్కులకు చేరిం ది. నిర్మల్ జిల్లాకే తలమానికమైన కడెం ప్రాజెక్టుకు వరద నీరు విపరీతంగా పోటెత్తుతోంది. గురువారం ఉదయం 11:00 గంటల సమయానికి కడెం ప్రాజెక్టుకు ఏకంగా 77,442 క్యూసెక్కుల భారీ ఇన్ ఫ్లో నమోదు కాగా, పరిస్థి తికి అనుగుణంగా అధికారులు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి ఉభయ నదులు పరవళ్లు తొక్కుతూ ఉధృతం గా ప్రవహిస్తున్నాయి. అక్కడ నీటిమట్టం 6.320 మీటర్ల ఎత్తులో మెట్ల వద్దకు చేరడంతో తీరం కొత్త రూపు సంతరించు కుంది. గోదావరి జలాలు పోటెత్తడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి ఇన్ ఫ్లో భారీగా పెరిగింది. ఎన్డీఎస్ఏ సూచన లను పాటిస్తూ అధికారులు బ్యారేజ్ కి చెందిన మొత్తం 85 గేట్లను ఎత్తేశారు. ప్రస్తుతం అక్కడ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో సమంగా 1,01,530 క్యూసెక్కులుగా కొనసాగుతుండటంతో గోదావరి ప్రవాహం దిగువకు వేగంగా పయనిస్తోం ది. ప్రాజెక్టుల్లో క్రమం గా నీటి నిల్వలు పెరుగుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు పరిస్థి తిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: