ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మేడారంలో గత నాలుగు రోజులుగా మేడారం మహా కుంభమేళా చివరి రోజు అయిన శనివారం కూడా లక్షలాదిమంది భక్తులు వచ్చి వనదేవతలను పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం ఆదివాసి పూజారులు దేవతలకుసంబంధించిన ఆడబిడ్డలు, సంబంధికులు కూడా వనదేవతలను వనానికి తీసుకువెళ్ల సమయంలో గద్దల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. నాలుగు గంటల పోలీసు భద్రత మధ్య తిరిగి సమ్మక్కను చిలకలగుట్ట కంక వనంలోకి తీసుకెళ్లగా సారలమ్మను కన్నెపల్లకితీసుకువెళ్లారువీరితోపాటుగోవిందరాజు,,పగిడిగిద్ద రాజులను కూడా వారి స్థలాలకు తీసుకెళ్లారు. అమ్మవార్లకు తీసుకువెళ్లే సమయంలో ప్రత్యేక పూజలు సమయంలో లైట్లను పూర్తిగా ఆర్పి వేసిఆదివాసిపూజారులు నిర్వహించారు. ఈ మహా జాతరలో దాదాపు కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు మమ్మల్ని చల్లగా చూడాలని పూజలు చేసి అమ్మవారికి ఇష్టమైన మేకలు కోళ్లు బలి ఇచ్చి సహ పంక్తి భోజనాలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రి సీతక్క అక్కడే ఉండి పర్యవేక్షణలో పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేయడంతో ప్రజలంతా ఆనందం ఆనందాల మధ్య దర్శనం చేసుకుని ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్లిపోయారు. ఘట్టం నేటితో ముగిసింది. దీంతో పోలీస్ యంత్రాంగంతోపాటు ఆయా శాఖల అధికారులు ఊపిరి పిలుచుకున్నారు.
Admin
E Nivas News