Friday, 31 July 2026 12:47:14 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలి...

టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Date : 03 April 2026 11:20 PM Views : 242

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కోరారు. శుక్రవారంమంచిర్యాల జిల్లాక్యాతనపల్లి ఎం ఎన్ ఆర్ గార్డెన్ లో మంచిర్యాల జిల్లా స్థాయి కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యతిథులుగా హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కార్మిక మైనింగ్ ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,జిల్లా ఇంచార్జ్.మంత్రి జూపల్లి కృష్ణారావు తోపాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావాద్ మంచిర్యాల ఎమ్మెల్యే, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఎమ్మెల్సీ దండే విఠల్,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ లు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి తోపాటు నూతన కార్యవర్గ సభ్యులతో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియార్టీ ప్రతిపాదికనే పదవులు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుం దన్నారు.అన్ని పార్టీల్లో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి.అవి అన్ని పక్కన పెట్టీ పార్టీ కోసం పని చేయాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ పది ఏండ్లు చేసిన అరాచకాలు కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతుందని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణల ను తిప్పి కొట్టాలన్నారు. గత పది ఏండ్ల బి ఆర్ ఎస్ పాలన లో రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చిం దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ భగీరథ పథకాల్లో భారీ స్కాం జరిగివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అప్పుల రాష్ట్రం గా మార్చారన్నారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణ రావు ఇచ్చిన ఆరుగ్యారంటీలు అమలుచేస్తున్నాం.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం లో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం అని తెలిపారు.గత ప్రభుత్వం లోజరిగినఅన్యాయలను వాస్తవాలను ప్రజలకు తెలియజేయా లన్నారు.రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఫ్యామిలీ త్యాగాల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కోసం ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారన్నారు. ప్రధాన మంత్రి పదవి కూడా చేపట్ట లేదని పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు రావాలన్నదే సంకల్పం అన్నారు. అలాంటి వారికి పార్టీ గుర్తింపు ఇస్తుం దన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని కోరారు. బిఆర్ఎస్ నిర్బంధ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు.అక్రమ కేసులు అనుభవించారు. కార్యక్తల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిందని దేశం లో కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉందన్నారు. 65 ఏండ్ల కాంగ్రెస్,టీడీపీ పాలన లో చేసిన అప్పుల కు వడ్డీలు కడుతూనే సంక్షమ పథకాలు అందిస్తున్నా మన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుండి కూడా పెట్టుబడులు పెట్టిస్తూ తెలంగాణను అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :