ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : భగవద్గీత ప్రతి ఒక్కరూ జీవన విధానం గా మార్చుకోవాలని గీతా సత్సంగ్ కన్వీనర్ జిల్లా సత్తయ్య అన్నారు. పట్టణంలోని సాంబశివాలయంలో సోమవారం నిర్వహించిన గీతా జయంతి ఉత్సవాలలో ఆయన మాట్లాడుతూ భగవద్గీత మనకు భగవంతుడు ఇచ్చిన జీవన విధానం అని దానిని తప్పక పాటిస్తే ఇబ్బందులు తొలుగుతాయని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచంలోని అన్ని సమస్యలకు భగవద్గీతలో సమాధానం ఉంటుందని తెలిపారు. భగవద్గీతలోని 701 శ్లోకాలు ఒక్కొక్క కళాఖండం అని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా గీతా యజ్ఞాన్ని భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించుకొని 18 అధ్యాయాలు పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో గీతా సత్సంగ సభ్యులు నరేందుల భీమన్న మాదంశెట్టి రామచందర్, గోలి రాజమౌళి, చింతల శ్రీనివాస్, బొద్దుకూరి సత్తయ్య,పల్లెర్ల మనోహర్, వజ్జల కాశన్న, కొత్త కేదారి, ఆవోపా జిల్లా అధ్యక్షుడు బొజ్జల రాజమౌళి, పట్టణ అధ్యక్షుడు కొత్త కిరణ్ కుమార్ మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.స్థానిక వ్యాపారులు సాయిని రవీందర్, జైన విద్యాసాగర్ దంపతులు పాల్గొన్నారు.
Admin
E Nivas News