Friday, 31 July 2026 03:53:52 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలి

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 29 October 2025 08:07 PM Views : 317

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అమృత్ 2.0 పథకం క్రింద జి.ఐ.ఎస్. ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని,ఇందు కొరకు అవసరమైన వివరాలను సంబంధిత శాఖల అధికారులు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డి.టి.సి.పి. సంయుక్త సంచాలకులు, అమృత్ 2.0 నోడల్ అధికారి అశ్విని, మంచిర్యాల డి.టి.సి.పి.ఓ. సంపత్ లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మందమర్రి మున్సిపల్ అధికారులకు మొదటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జి ఐ ఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. నగరం ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి, 20 సంవత్సరాల వరకు భవిష్యత్తు అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలని తెలిపారు. డిజిటల్ మ్యాపింగ్ లో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి భూ వినియోగ మ్యాప్‌లు రూపొందించవచ్చని, నూతన డేటాను ప్రతిబింబించేలా జి ఐ ఎస్ ఆధారిత ప్లాన్‌లను నవీకరించవచ్చని, తద్వారా అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. సమగ్ర ప్రణాళిక ద్వారా భవిష్యత్తు అభివృద్ధికి భూ వినియోగం, భవన నిర్మాణం, రవాణా, వివిధ రంగాల అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. 2051 సంవత్సరం నాటికి జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని, తరగతుల వారీగా జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన ఇండ్లు,త్రాగునీరు, రహదారులు,ఇతర ప్రజాసేవలు ప్రణాళికాబద్ధంగా అందించేందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు. ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా, ఉద్యానవనాలు, పచ్చదనం అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 37.67 కిలోమీటర్ల ఏరియాలో,మందమర్రి మున్సిపల్ పరిధిలో 38.98 కిలోమీటర్ల ఏరియాలో డ్రోన్, సోషియో ఎకనామిక్ సర్వే పూర్తి చేయడం జరిగిందని, ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయి సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ కార్యకలాపాల సమయంలో అవసరమైన మద్దతును అందించాలని, సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని,కార్యక్రమ నిర్వహణ కొరకు టిపిబివోలు, వార్డు ఆఫీసర్ లను సహాయకులుగా నియమించి బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో మున్సిపాలిటీలో పబ్లిక్ నోటీస్ జారీ చేయాలని, సర్వే కార్యకలాపాల సమయంలో కన్సల్టెంట్ లకు అవసరమైన సహాయం అందించాలని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో రూపొందించే జి ఐ ఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా తయారు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :