ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఈనెల 14న నిర్వహించనున్న బీసీ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన నాయకులు తమ పార్టీ వైఖరిని పక్కన పెట్టి ఒకే వేదికపై నిలబడి మద్దతు తెలపాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యువ నాయకుడు వరిపల్లి అనిల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న డిమాండ్ ప్రజల మనసులోని నినాదం. ఈ బంద్ రాజకీయ ప్రయోజనం కోసం కాదు, బీసీ వర్గం కోసం, సమాన హక్కుల కొరకని అందువల్ల అన్ని పార్టీలు, ముఖ్యంగా బీసీ నాయకులు, ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా తమ వర్గం పట్ల బాధ్యత చూపాల న్నారు. అలాగే, బంద్ రోజున బీసీ యువత, విద్యార్థులు, సంఘాలు, ప్రజా ప్రతినిధులు సమైక్యంగా పాల్గొని శాంతియుతంగా మన ఐక్యతను చూపించాలని అనిల్ కుమార్ కోరారు.
Admin
E Nivas News