Wednesday, 08 April 2026 05:05:05 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం...

Date : 07 April 2026 01:36 AM Views : 40

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతం తో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమ బాసర సరస్వతి ఆలయంలో దర్శనం చేసుకున్నఅ నంతరం 225 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలకు కాకుండా వేరే రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి వారి యొక్క పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం అమ్మవారి కృపకు నిదర్శనం అన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అమాయకులని ఇప్పటికి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న వారిని ఏ కోశాన అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పటి వాడికి ఇప్పటికే ఆదివాసి ప్రజలు గుడిసెల్లోనే కాలం వెల్లదిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక ఎన్నో కష్టాలు ఎదురవుతున్న తప్పక తీర్చడం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శత్రువులుగా చూడడం పద్ధతి కాదన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం అందరూ రాజకీయ ప్రత్యర్థులే గాని శాశ్వతమైన శత్రువులు కాదన్నారు. వారిని నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని తీరుస్తామన్నారు. దేవాలయాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బాసర నుండి మొదలుకొని భద్రాచల వరకు ఉన్న ఆలయాలని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. తుమ్మిడి హెట్టి నుండి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను ప్రారంభించి ఆదిలాబాద్ జిల్లాకు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. రైతన్న సంక్షేమం కోసం పలు ప్రాజెక్టులను సాగు నీరు కోసం తాగునీటి కోసం పునరుద్ధరిస్తామని తెలిపారు. అభివృద్ధికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. అంతేకాకుండా అధికారం అంటే హోదా కాదు మా బాధ్యత అన్నారు. మేము పాలకులం కాదు ప్రజా సేవకులమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని అన్నారు. పేద విద్యార్థుల విద్యను దృష్టిలో పెట్టుకొని 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పీపుల్స్ మార్చ్ ద్వారానే రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 900 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. కాలేకడుపుతో విద్యార్థులు బడికి వెళ్ళద్దని ఉద్దేశంతోనే పౌష్టికాహార భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. మారదులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 28 నెలల్లో పదివేల కోట్ల రూపాయల చెల్లించడం జరిగిందన్నారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు ఇల్లు లేని వారికోసం ఇందిరమ్మ ఇండ్లకు 5,400కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు సన్న బియ్యం తినాలని ఉద్దేశంతో కుటుంబం మీద ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. అలాగే ప్రేమ్ సాగర్ రావు కోరిక మేరకు గూడెం శ్రీ రామాచారి సత్యనారాయణ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులు నాయకులు ఆలయ పరిసరాలు పరిశీలించి ఒక నివేదిక సమర్పించినట్లయితే నిధులు కేటాయిస్తామన్నారు. ఇప్పటివరకు పాలపిట్ట రంగులో ఉన్న చీరలు ఆడబిడ్డలకు అందజేశామని ప్రస్తుతం చిలకపచ్చ రంగుతో ఉన్న చీరలు డిసెంబర్ మాసంలో ఆడబిడ్డలకు అందిస్తామని తెలిపారు. అలాగే సరిపడా నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు తెలిపారు. ఈ బహిరంగ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రులు కొండా సురేఖ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ గొడమ్ నగేష్, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, బొజ్జు, అనిల్ జాదవ్,పాయల్ శంకర్, ప్రజా ప్రతినిధులలో నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :