ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పూసల సంఘం భవన నిర్మాణానికి రూ. 20 లక్షల నిధులు కేటాయించినందుకు గాను ఆ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఐటి మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గుంటుపల్లి సమ్మయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాలను ఆదుకున్న ఘనత ఒక శ్రీధర్ బాబుకి దక్కుతుందన్నారు. సంఘం భవనానికి నిధులు కేటాయించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పూసల సంఘం తాజా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటుపల్లి సమ్మయ్య పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పొదిల కుమారస్వామి ప్రధాన కార్యదర్శి ముద్రకోలా తిరుపతి ఉపాధ్యక్షులు పట్టం తిరుపతి మంథని పూసల సంఘం ప్రధాన కార్యదర్శి కావేటి సమ్మయ్య కోశాధికారి కావేటి శ్రీనివాస్ కార్యదర్శి చేని రవి గుంటుపల్లి సతీష్ కావేటి పెద్ద సమ్మయ్య కావేటి సారయ్య కావేటి రాంబాబు ముద్ర కోలా రమేష్ లు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News