ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరిపెడ పురపాలికలోని 15 వార్డులతో పాటు చైర్మన్ స్థానం బీఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకోనుందని మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సునాయాసంగా గెలిచారని స్పష్టం చేశారు. అదే స్పూర్తి తో పురపాలక ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటు లో ఉండే నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ మే నని స్పష్టం చేశారు. మరిపెడ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలతో సుస్థిరమైన అభివృద్ధి చేయటం జరిగింది అన్నారు. ఉమ్మడి జిల్లాకు ఇండోర్ స్టేడియం తలమానికంగా మారిందని, మున్సిపల్ పార్కు, మరిపెడ ఎస్సీ కాలనీ లో వ్యాయామ శాల, పల్లె, పట్టణ ప్రగతి పనులు, సెట్రల్ లైటింగ్ తో మరిపెడ దేదీప్యమానంగా కాంతులీ నిందని తెలిపారు. చేసిన ప్రగతి ని ప్రజల ముందు ఉంచి ఓటర్లను అభ్యర్థించాలని కోరారు. మరిపెడ పురపాలిక సునాయసంగా బీఆర్ఎస్ పార్టీ గెలవనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, డీఎస్ రవి చంద్ర, ఆయుబ్ పాషా, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పల వెంకటేశ్వర్లు, గంట్ల మహిపాల్ రెడ్డి, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల సతీష్, ఏరసాని రమణారెడ్డి, వెర్మా రెడ్డి రమేష్ రెడ్డి, ముదిరెడ్డి రంగారెడ్డి, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, మధు, నరేష్, పానుగోతు వెంకన్న,సయ్యద్ లతీఫ్, మక్సుద్ద్, దిగజర్ల శ్రీనివాస్, గోల్కొండ వెంకన్న, చిదుముల సంతోష్, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News