Wednesday, 08 April 2026 05:01:58 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు...

సీఎం రేవంత్ రెడ్డి

Date : 05 April 2026 01:33 PM Views : 39

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు కేరళం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చివరిరోజున అక్కడి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాగాతొలిసారిగా పెదవి విప్పారు. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపడుతాంఅన్నారు.ఈసారి పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తాంఅని వివరించినట్లు కేరళం మీడియా ప్రతినిధులు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తున్నామనే అంశంపై సీఎం అక్కడి మీడియాకు పూర్తిస్థాయిలో తెలియజేశారు. రైతు రుణమాఫీ వల్ల ఎంత మంది రైతులకు ప్రయోజనం కలిగిందో వివరించారు. ప్రతిఏటా రైతు భరోసా స్కీమ్ కోసం ప్రభుత్వం రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇప్పటివరకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ పథకాల వల్ల ప్రయోజనం పొందిన లబ్ధిదారుల సంఖ్యను లెక్కలతో సహా వెల్లడించారు. ఎన్నికల బిజీలో ఐసీసీ నేతలు... ప్రస్తుతం ఏఐసీసీ నేతలు పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈనెల 9న కేరళం, పాండిచ్చెరి, అస్సాంలో పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పోలింగ్‌పై ఫోకస్ పెట్టనున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానంలోని పెద్దలకు కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు సమయం దొరకడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత రాష్ట్రానికి చెందిన కీలక నేతలను ఢిల్లీకి పిలిపించి కేబినెట్ విస్తరణ, ప్రక్షాళనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కేబినెట్ నుంచి తప్పించే జాబితాపై ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని, కొత్తగా కేబినెట్‌లోకి తీసుకునే నేతల ఎంపికపై చర్చించనున్నట్లు తెలిసింది. ఆ మీటింగ్‌లోనే శాఖల మార్పు అంశంపై సీఎం రేవంత్ తన ప్రపోజల్స్‌ను అధిష్టానం ముందు పెడుతారనే ప్రచారం జరుగుతున్నది. ఊహాగానాలకు తెర పడనున్నది... కేబినెట్ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ, అసెంబ్లీ సమావేశాల సమయంలో విస్తరణ అంశాన్ని సీఎం రేవంత్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తవించిన సమయంలో 'కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో అప్పుడేn చేస్తాం' అంటూ వెల్లడించారు. కేరళంలో మాత్రం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పడంతో ఇంతకాలం వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అదే రాష్టానికి చెందిన ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ప్రచారం బిజీగా ఉండటంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి తర్వాత విస్తరణ అంశంపై చర్చించి, ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర ఏండ్లు అవుతుంది. ఇప్పటికీ మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఉన్నాయి. వాటిని ఇంకా భర్తీ చేయకుండా పెండింగ్‌లో పెట్టడం వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదు. పైగా ఇంటా, బయట విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడే విస్తరణ, ప్రక్షాళన చేయడం మంచిదనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. కాగా, కేవలం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేస్తారా, కొందరిని తప్పించి ఆ స్థానాల్లో కొత్త వాళ్లను కేబినెట్‌లోకి తీసుకుంటారా? అనేది హైకమాండ్‌తో సంప్రదింపుల తర్వాత క్లారిటీ రానుంది. పనితీరు సరిగా లేని మంత్రులను తప్పించి అదే సామాజిక వర్గాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రుల శాఖలను తప్పించి, అంతగా ప్రయారిటీ లేని శాఖల బాధ్యతలు ఇవ్వాలని కొందరు ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :