ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ లోఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఎంపీడీవో బండారు ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం బెజ్జూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ సరోజా దుర్గం తిరుపతి పంచాయతీ కార్యదర్శి మీసారీ వైకుంఠంతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరోజ మాట్లాడుతూ మధ్య దళారులను నమ్మి లబ్ధిదారులు గ్రామస్తులు మోసపోవద్దని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు చూపిన కొలతల ప్రకారంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని నాణ్యతతో నిర్వహించాలన్నారు. నిర్మాణ దశలను బట్టి ప్రతి సోమవారం ప్రభుత్వం ద్వారా బిల్లులను చెల్లించడం జరుగుతుందని నేరుగా బిల్లును లబ్ధిదారుల ఖాతాలోకి వస్తాయన్నారు. అమాయక ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని ఇందిరమ్మ ఇల్లాలను మంజూరు చేయించి ఇస్తామంటూ మాయ మాటలు చెప్పే మోసగాళ్లను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఎవరైనా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తాం డబ్బులు ఇవ్వమంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వీరితో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, బెజ్జూరు గ్రామపంచాయతీ ప్రజలు ఉన్నారు.
Admin
E Nivas News