Thursday, 30 July 2026 08:08:22 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మహిళల లు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజ అభివృద్ధి చెందుతుంది

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 25 November 2025 10:49 PM Views : 294

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని మంచిర్యాలజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ పథకంలో భాగంగా మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, మండలాల తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తుందని, ఇందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళను కుటుంబ పెద్దగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ళ పెంపకం, డైరీ ఫార్మ్, క్యాంటీన్ ఇతర వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మందమర్రి మండలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో పాటు మిగతా ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దండేపల్లి మండలంలో మహిళల నిర్వహణలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు. అనంతరం మంచిర్యాల నియోజకవర్గంలోని 1 వేయి 618 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 43 లక్షల 61 వేల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ టి ఐ నెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నలిమేల రాజు,మాజీ సర్పంచ్ కందుల మోహన్, మాజీ మార్కేట్ అధ్యక్షుడు బియ్యల తిరుపతి, అధికారులు,ప్రజా ప్రతినిధులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :